అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన సిరిమానోత్సవం
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 16 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబరు 15, సాయంత్రం కన్నుల పండుగగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు భద్రత, జాగ్రత్తా చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సిరిమాను వెంబడి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తిరిగి, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు.
సిరిమానోత్సవం ముగిసిన తరువాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళులో బ్యారికేడ్లును ఒక క్రమ పద్దతిలో తొలగించి, వారు అన్ని మార్గాలలో వెళ్ళేందుకు అనుమతించారు. పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సేవాదళ్ దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విశేషమైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందింది. అదే విధంగా మహిళలకు ఆకతాయిల వేధింపులు లేకుండా, వారిపై నిఘా వేసి, అదుపులోకి తీసుకోవడం, మహిళలకు రక్షణ కల్పించడం సత్ఫలితాలిచ్చింది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైం బృందాలు పట్టణంలోని రద్దీ ఉన్న ప్రాంతాల్లో కలియ తిరుగుతూ, అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. డివైజ్‌లో పరిశీలించి, ఎటువంటి చెడు నడత లేదని నిర్ధారణ చేసుకున్న తరువాతనే వారిని విడిచి పెట్టడం కూడా సత్ఫలితాలిచ్చాయి. సిరిమానోత్సవం అనంతరం సిబ్బంది విధుల నుండి వెళ్ళిపోకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టి, తమకు కేటాయించిన స్థానం వద్దనే ట్రాఫిక్ రెగ్యులేషన్‌కు ప్రత్యేక చర్యలను పోలీసుశాఖ చేపట్టడం కూడా సత్ఫలితాలిచ్చింది. సిరిమానోత్సవం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియుటకు అన్ని వర్గాల ప్రజల తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. విద్యుత్, అటవీ, ఆరోగ్య, మున్సిపల్, ఫైర్, రెవెన్యూ,దేవాదాయ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పని చేసాయన్నారు. అదే విధంగా ప్రజలు, పాత్రికేయులు, ఇతరజిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని, వారందరికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి దొంగతనాలు జరగకుండా భక్తులను పోలీసు కంట్రోల్ రూం నుండి సిసి కెమెరాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం, పోలీసులు మఫ్టీలో పహారా కాయడం, అనుమానితుల వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో చెక్ చేసి, వారు పాత నేరస్థులా? కాదా? అన్న విషయం నిర్ధారణ కావడంతో ఎటువంటి దొంగతనాలు జరగలేదు. అన్ని ముఖ్య కూడళ్ళులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను తాత్కాలిక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడంతో సిసి పుటేజులను కమాండ్ కంట్రోల్ నుండే జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారు. సిసికెమెరాల ఫుటేజులు పరిశీలించి, రద్దీని బట్టి, మార్గాలను మళ్ళించడం జరిగింది. బందోబస్తు, భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తోపాటు, అదనపు ఎస్పీలు పి. సౌమ్యలత, ఎల్.మోహనరావు, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, ఎం.వీరకుమార్, ఎస్.రాఘవులు, ఎన్.కాళిదాసు, యూనివర్స్, జి.యు.కే.ఎల్.వి. సుబ్బరాజు, పి.నాగేశ్వరరావు, బి.సీతారాం, ఎస్బీ సిఐలు ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి,పలువురి సిఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించి ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగామని, పోలీసుశాఖకు సహకరించిన జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కృతజ్ఞతలు తెలిపారు.