జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గా పూజలు
జనం న్యూస్ 13 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో దసరా పర్వదినంను పురస్కరించుకుని పోలీసులు వినియోగించే వివిధ ఆయుధాలు మరియు పోలీసు వాహనాలకు అక్టోబరు 12న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మరియు 5వ బెటాలియన్ కమాండెంట్ మలిక గార్గ్, ఐపిఎస్ దంపతులు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొని, దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, కమాండెంట్ మలిక గార్గ్ దంపతులకు వేదపండితులు వేద మంత్రాలు, పూర్ణ కుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగాను, దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు పోలీసులు వినియోగించే వివిధ ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం సంప్రదాయమన్నారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి దేవీ దుర్గామాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ప్రజలు, పోలీసు ఉద్యోగులు సుఖశాంతులతో జీవించేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, కమాండెంట్ మలికా గార్గ్ దంపతులు క్యాంపు కార్యాలయంలోని పోలీసు వాహనాలకు, ఆర్మ్డ్ రిజర్వు ఆయుధగారంలోను, మోటారు ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషనులోని పోలీసు వాహనాలకు, బిడి టీం పరికరాలకు, దుర్గా దేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. జిల్లా పోలీసు విభాగాలకు అన్ని విధాలుగా శుభాలు జరగాలని ప్రార్ధనలు చేసి, వేద పండితులు ఆశీర్వచనం పొందారు. దశరా పండగ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, కమాండెంట్ మలిక గార్గ్ దంపతులు పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపి, ప్రజలందరకీ మంచి జరగాలని, తలపెట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయం చేకూరాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.భగవాన్, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే చౌదరి, మహిళా పోలీసు స్టేషన్ సిఐ ఈ.నర్సిమూర్తి, భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ పలువురు ఆర్.ఎస్.ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.