అమీనాబాద్ లో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం

జనం న్యూస్,అనంతగిరి

మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్ద  నూతనంగా ఏర్పాటు చేసిన  సూర్య డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈసందర్భంగా లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి,కోదాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ పట్టణ యువత అధ్యక్షులు డేగ శ్రీధర్, కోదాడ మత్స్యశాఖ చైర్మన్ వీరాస్వామి,మాజీ ఎంపీటీసీ అంబటికర్ర శ్రీను,అహ్మదాబాద్ మాజీ సర్పంచులు ముత్తినేని కోటేశ్వరరావు, చిలకమూడి విశ్వేశ్వరరావు,సాదే కోటేశ్వరరావు,బోడపూడి సత్యనారాయణ,ధారావత్ సైదులు, ముస్తఫా,కోదాడ పట్టణ సిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గూగుల్ సురేష్,డాక్టర్ ప్రణీత్ గుప్తా,అంబటికర్ర  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.