మాల మహానాడు అసెంబ్లీ ముట్టడికి మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్

మాల మహానాడు అసెంబ్లీ ముట్టడికి మాల మహానాడు నాయకుల ముందస్తు  అరెస్ట్

ఖేడ్ డివిజన్ ఉపాధ్యక్షులు ముత్యాల సాయిలు,ప్రధాన కార్యదర్శి గైని మారుతి,

జనం న్యూస్,డిసెంబర్  19,కంగ్టి    సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరే మాల మహానాడు  నాయకులను గురువారం కంగ్టి ఎస్ ఐ విజయ్ కుమార్,పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ  వర్గీకరణ ఆర్టికల్ 341 రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు.శమీ అత్తర్ కమిటీ రిపోర్టు ఇవ్వకముందే సీఎం రేవంత్ రెడ్డి,వర్గీకరణ చేస్తామని చెప్పడం రాజ్యాంగ విరోధమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు కొత్తగా గైని సాయిలు,ఉపాధ్యక్షులు సరిక్,సిద్దరం,సీనియర్ నాయకులు దెగులాడి శంకర్,సంగ్రామ్,  తదితరులు పాల్గొన్నారు.