ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు
జనం న్యూస్ 27 అక్టోబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
బొబ్బిలి, కొత్తవలస, డెంకాడ వద్ద ఉన్న ఫ్రాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇసుక పక్కదారి పట్టడానికి వీలు లేదని, తూనిక యంత్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్ పాల్గొన్నారు.