ఈ ఫొటోలో ఉన్న పాప ఇండియా లోనే పెద్ద హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!
జనం న్యూస్: ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు షేర్ చేసే ట్రెండ్ కొనసాగుతోంది. కొందరు సెలబ్రిటీలను వారి చిన్నతనంలో చూస్తే మనం అస్సలు గుర్తు పట్టలేము. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ.. చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు. ఫోటోలోని చిన్నారిని చూస్తే అమాయకంగా.. ఎంత ముద్దొస్తుందో కదా. ఇలాంటి చలాకీ పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత బాగుటుంది అనిపించకమానదు. ఇక క్యూట్‌గా ఉన్న ఈ చిచ్చరపిడుగు.. తన అందం, అభినయంతో దేశాన్ని ఓ ఊపు ఉపింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో కుర్రాళ్లుకు గిలిగింతలు పెట్టింది. గ్లామర్ పాత్రలతో.. వెండి తెరను ఓ ఊపు ఊపింది. అందం మాత్రమే అనుకుంటే కాదు.. అభినయంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. కీలక పాత్రలో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది. చెక్కు చెదరని అందంతో.. కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలిస్తోంది. పాన్ ఇండియా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంత చెప్పినా ఆ నటి ఎవరో గుర్తు పట్టలేదా.. అయితే మేమే చెబుతాం వినండి. కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తన పాత్రకు ప్రాధన్యమున్న సినిమాల్లో నటించి.. మంచి నటిగా అందరి చేత ప్రశంసలు పొందింది. ఆమె అమ్మోరు తల్లి పాత్రలో కనిపిస్తే.. జనాలు థియేటర్లో నిజమైన దేవతగా భావించి హారతులిచ్చారు. ఇక బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో నా మాటే శాసనం అని కన్నెర్ర చెస్తే.. తెర ముందు కూర్చున్న ప్రేక్షకులు సైతం భయపడ్డారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా. అవును ఆ ఫోటోలోని ఆ చిన్నారి ప్రముఖ నటి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ అంటే ఈతరం వాళ్లు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. శివగామి అంటే చాలు.. ప్రతి ఒక్కరు వెంటనే గుర్తు పడతారు. బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత లైగర్ ద్వారా మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులు ముందుకు వచ్చింది రమ్యకృష్ణ. సినిమా డిజాస్టర్ అయినప్పటికి రమ్యకృష్ణ పర్‌ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 1983లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రమ్యకృష్ణ. భలే మిత్రులు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా విజయం సాధించడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక కెరీర్ తొలినాళ్లల్లో కేవలం గ్లామర్ ప్రాధాన పాత్రల్లో నటించి.. కుర్రాళ్ల గుండెల్లో అందాల దేవతగా ముద్ర వేయించుకుంది. కొన్నాళ్ల తర్వాత కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం తన సొంతం అని నిరూపించుకుంది. సినిమాల్లోకి రాకముందు రమ్యకృష్ణ మంచి డ్యాన్సర్. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి.. న్యాట ప్రదర్శనలు ఇచ్చింది. ఇక కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకుచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందుతోంది. ఇక రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇక రమ్యకృష్ణ.. తన భర్త కృష్ణ వంశీ తీసిన చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన నటనతో దేశాన్ని ఓ ఉపు ఊపేస్తోంది రమ్యకృష్ణ. ఇక తాజాగా సెలబ్రిటీల చిన్నానటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రమ్యకృష్ణ కూడా తన చిన్నప్పటి నుంచి హీరోయిన్‌గా ఎదిగే వరకు తాను ఎలా ఉందో తెలియజేసే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. చిన్నారి రమ్యకృష్ణను చూసి జనాలు అస్సలు గుర్తు పట్టలేరు. చిన్న తనం నుంచే ఎంతో క్యూట్‌గా ఉంది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.