ఎంత ఘోరం ఎంత అన్యాయం గంటల కొద్ది ట్రాఫిక్ అటు విద్యార్థులు ఇటు ఉద్యోగస్తులు
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబరు 19, (రిపోర్టర్ ప్రభాకర్):
పార్వతీపురం నుండి ఒరిస్సా వెళ్లే వాహనాలకు గుమడ గ్రామం వద్ద రహదారి లో పెద్ద గొయ్యిలో లారీ దిగిపోవడం ఆరు గంటల ట్రాఫిక్ లో సుమారు 7 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. అటు ఒరిస్సా నుండి ఇటు ఆంధ్రాకు వచ్చే వాహనాలు ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు రహదారి కు నేరు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఆరు గంటల నుండి అడపా దడప ఒక్కొక్క లారీ భయంతో వచ్చే పరిస్థితిలో ఇంకా ట్రాఫిక్ కొనసాగుతున్న పరిస్థితి. సిపిఎం పార్టీ లారీ అసోసియేషన్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గోతులు కప్పడమే తప్ప రోడ్లు భవనాల శాఖ అధికారుల నుండి పూర్తిగా స్పందన లేని పరిస్థితి లేదు. టెండర్ టెండర్ అంటూ పత్రిక ప్రకటన ఇవ్వడమే తప్ప టెండర్లు లేదు నిధులు లేదు రహదారి మార్గంలో గోతులు ఉన్న కప్పే పరిస్థితి లేదు ఎందుకు ఇలా జరుగుతుంది. ఇది గడిచిన మూడున్నర సంవత్సరాలు కాలంగా పార్వతీపురం నుండి కు నేరు మీదుగా మూడు రాష్ట్రాలకెళ్లే రహదారి పరిస్థితి. ప్రతిరోజు వాహనదారులు గోతుల్లో ఇరికిపోవడంతో పెద్దపెద్ద లారీలు గోతులు విరిగిపోవడంతో జెసిపిలు తెప్పించి అధిక మోతాదులో అద్దె చెల్లించుకొని గోతుల నుండి లారీలను బయటికి తీసే పరిస్థితి. ఈ విధంగా జరుగుతుంటే రోడ్లు భవనాల శాఖ అధికారులు మాత్రం నిమ్మకి నీరు ఎత్తినట్లుగా కార్యాలయంలో ఏసీ రూములో కూర్చొని ఇదిగో టెండర్ అదిగో టెండర్ వేస్తాం అంటూ కాలయాపన చేసే పరిస్థితి తప్ప ఈ రోడ్లు మరమ్మత్తులు ఎలా చేస్తాం అనే విధంగా ఆలోచన లేకపోవడం చాలా అన్యాయం.ఇప్పటికైనా పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించిన 11.75 కోట్లు రూపాయలు పార్వతిపురం మన్యం జిల్లాకి నిధులు విడుదల చేసి వెంటనే కాంట్రాక్ట్ ని రప్పించి, పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కు నేరు మీదుగా మూడు రాష్ట్రాలకి వెళ్లాయి రహదారి మార్గంలో ఉన్న గోతులను కప్పి అటు వివిధ వాన దారులకు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని లేనియెడల ఈనెల 25వ తేదీ దాటిన తర్వాత పెద్ద ఎత్తున అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు కు నేరు గ్రామం వద్ద పెద్ద ఎత్తిన సిపిఎం పార్టీ మరియు లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయుచున్నారు.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి.