"కక్ష సాధింపు చర్యలు ఆపాలి”
జనం న్యూస్ 10 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీకి శనివారం వినతిపత్రం సమర్పించారు. సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమ కేసులు మోపడం సరికాదన్నారు. టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడు జగన్‌పై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వాళ్ల పైన చర్యలు తీసుకోవాలని కోరారు.