కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేయడమే ఏచూరికి నివాళి

కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేయడమే ఏచూరికి నివాళి

జనం న్యూస్ 14 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
కార్మీక పక్ష పాతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేయడమే ఆయనకి కార్మిక వర్గం ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లకార్యాధర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అన్నారు సీతారాం ఏచూరీ మరణం వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు,శ్రామిక వర్గానికి తీరనిలోటని రెడ్డి శంకరరావు అన్నారు కళాశి సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ కోట వద్ధ గల సిమెంట్ కళాషీల తో నిర్వహించి నివాళి అర్పించారు.  ముందుగా రెడ్డి శంకరరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకి  అండగా నిలబడ్డారని ఆయన ఎంపిగా పార్లమెంటులో ఆనేక ఉపన్యాసాలు చేశారని. కార్మిక చట్టాలను మార్పుకి వ్యతిరేఖంగా పార్లమెంట్ లో తన ఘలం విప్పారని. కార్మిక హక్కుల రక్షణకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేసారు. కార్మిక-కర్షక పోరాటాల మార్గదర్శి అని సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీ లేని యుద్దం చేసిన పోరాట యోధుడని అన్నారు.  వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారధిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుండి మూడు దశాబ్దాలుగా ఏన్నో పోరాటాలకు ఊపిరి పోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి, అనేక త్యాగాలతో, జైలు జీవితానికి కూడా సిద్దపడి, పోరాట జెండాను ఎగుర వేసిన ఏచూరి మరణం నా లాంటి వారికి తీవ్ర బాధను, దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ, అధికారమే పరమావధిగా మెడలోని కండువాలను మార్చేసే నేటి రాజకీయాలు కాలంలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ, సమసమాజం కోసం పరితపిస్తూ నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు నిలబడ్డారని తెలిపారు.  12వ తరగతిలో సిబిఎస్ఇ సిలబస్ లో ఆలిండియా టాపర్ గా యూనివర్సిటీలో ఎ ప్లస్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ సాధించారని, 8 బాషలలో మాట్లాడుతారని తెలుగు నేల నుండి ఉద్భవించి దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నాయకుడిగా, ఎస్.ఎఫ్.ఐ అఖిల భారత అధ్యక్షులుగా, 32 ఏళ్ల వయసులోనే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఉత్తమ పార్లమెంటు సభ్యునిగా, రచయితగా, సిపిఎం ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంతో సేవ చేసారని, ఎంతోమంది వామపక్ష,ప్రజాతంత్ర నాయుకులను తయారు చేసారని, ఇతర దేశాల వామపక్ష నాయుకులు ఏచూరి గారి సలహాలు తీసుకునేవారని తెలిపారు. పార్లమెంటులో ఆయన చేసిన ఒక్కో ప్రసంగం ఒక్కో వ్యాసమని ఇంతటి గొప్ప వారు మన మధ్య నుండి దూరం కావడం అత్యంత బాధాకరమని అన్నారు. సీతారాం ఏచూరి నుండి ఎంతో నేర్చుకోవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు కోసం, సమసమాజం కోసం కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీ రాజు కార్మికులు పాల్గొన్నారు.