రైతులకు పెట్టుబడి సాయం తప్పకుండ అందించాలి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి
కాంగ్రెస్ ప్రభుత్వంకల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పెద్దపులి రవి హెచ్చరిక....
జనం న్యూస్ అక్టోబర్26.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
రైతులందరి ఖాతాలలో పంటపెట్టుబడి పథకానికి సంబందించిన రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, రైతుభరోసా సాయం అందువరకు కూడ రైతుల పక్షాన నిలబడి పోరాడేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతుభరోసా డబ్బులు రైతులకు అందించేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు రెండు పంటలకు కలిపి ముష్టి 10 వేల రూపాయలు రైతుబందు ఇస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుభరోసా ద్వారా ఎకరాకు 15 వేల రూపాయలను ప్రతి రైతుకు తప్పకుండ అందిస్తామని ఎన్నికలలో ప్రగల్బాలు పలికిన నేటి ప్రభుత్వ పెద్దల మాటలేమాయ్యాయని శివంపేట మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి ప్రశ్నించారు. ఎన్నికలలో హామీ ఇచ్చి ఇప్పుడు పూటకో మాటతో ప్రభుత్వం రైతులకు రైతుభరోసా ఎగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలు కావస్తున్న ఇంతవరకు రైతులకు పంటపెట్టుబడి సాయం అందించకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి, వానాకాలం రెండు పంటలకు కూడ రైతులకు రైతుభరోసా సాయం అందించక, రైతు రుణమాఫీ కొందరికే చేసి అన్నదాతలను ఆగం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకిచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడ ఎకరాకు 15 వేల రూపాయల రైతుభరోసా సాయం అందించడంతో పాటు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తింపజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.రైతులకు రుణమాఫీ, రైతుభరోసా డబ్బులు అందించే వరకు కూడ ప్రభుత్వంపై అన్నదాతల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తామని శివంపేట మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవిహెచ్చరించారు.