గద్వాల ప్రజలు కష్టాల్లో ఉంటె ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం విదేశీ జల్సాలా...?.

గద్వాల ప్రజలు కష్టాల్లో ఉంటె ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం విదేశీ జల్సాలా...?.

జనం న్యూస్ 06 నవంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా  BRS పార్టీ రాష్ట్రనాయకుడు డా.కురువ విజయ్ కుమార్ ఎమ్యెల్యే బండ్ల పై మండిపాటు..ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా BRS పార్టీ ఆఫీస్ లో జరిగిన  విలేకరుల  సమావేశంలో BRS పార్టీ రాష్ట్రనాయకుడు డా.కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ..గద్వాల ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉంటె ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ సొమ్ముతో విదేశీ జల్సాలు చేస్తున్నాడు అని దానికి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఠానాయకుడు అని దుయ్యబట్టారు...టూరిజం శాఖ ఆధ్వర్యంలో లండన్లో  అంతర్జాతీయ టూరిజం ఎక్స్పో లో తెలంగాణ టూరిజం శాఖ తరుపున స్టాల్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 5 మంది ఎమ్యెల్యే లకు ఏమి పని అని డా.కురువ విజయ్ కుమార్ ప్రశ్నించారు...బిజ్వారం గ్రామానికి చెందిన బీసీ వడ్డే రాజేశ్వరి మృతికి కారణమైన ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోదరుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి ని కాపాడటం కోసం పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అరెస్టు కాకుండా చేస్తున్న ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని కూడా ఈ కేసులో A 2 గా చేర్చి శిక్షించాలని ప్రభుత్వాన్ని విజయ్ కుమార్ డిమాండ్ చేశాడు. నడిగడ్డలో బండ్ల కుటుంబం చేతిలో ఇప్పటికే అనేకమంది అమాయక ప్రజలు చనిపోయారు చనిపోయిన పేదవారి శవాలకు వెలకట్టే బండ్ల కుటుంబాన్ని పీడీ యాక్టు పెట్టి కఠినంగా శిక్షించాలి అని అన్నారు..ఒకవేళ రాజేశ్వరి మృతి వెనుక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి లేకపోతె ఇప్పటివరకు అమ్మాయి కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదు. అదేవిదంగా నిందితుడిని అరెస్టు చేయమని  పోలీసులను ఎందుకు డిమాండ్ చేయడంలేదు అని విజయ్ ప్రశ్నించారు...అసలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి BRS పార్టీనుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ లోకి ఎందుకు వెళ్ళాడు మళ్ళీ నేను BRS లోకి ఎప్పుడైనా వెలుతాను అని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి...నేను ఒక్కటే అడుగుతున్నా ఎమ్యెల్యే BRS పార్టీనా...?కాంగ్రెస్ పార్టీనా...? నీవు ఆగట్టున ఉంటావా...? ఈగట్టున ఉంటావా...? నీకు చిత్తశుద్ధి ఉంటె వెంటనే ప్రజలకు సమాధానం చెప్పు. జిల్లా BRS పార్టీ ఆఫీసుక. సంబందించిన డాక్యూమెంట్లను వెంటనే పార్టీ అధిష్టానానికి హ్యాండ్ ఓవర్ చేయాలని కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,మంద మల్లికార్జున్,ప్రతాప్ రెడ్డి,బీచుపల్లి,మాత్తళి,రవి,రాము తదితరులు పాల్గొన్నారు.