జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి

--జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేద్కర్
జనం న్యూస్ 20 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం నవంబర్ 19 జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ )32వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ )32వ వార్షికోత్సవ కేక్ ను  కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జిల్లా  జాప్ నాయకులు పూల బుకే అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు .ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు .చిన్న పత్రికల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు అనంతరం జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి రమేష్ చేతుల మీదుగా జాప్ 32వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు  సంబంధించిన కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా ఏడి రమేష్ ను జిల్లా జాప్  నాయకులు పూలుబుకే అందించి ఘనంగా శాలువతో  సత్కరించారు అంతకుముందు విజయనగరం మండలం పెనవేమలి లో ఉన్న ఏబిసిడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్  జిల్లా అధ్యక్షులు జామి కృష్ణ, జాప్ జాప్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్ల సూరిబాబు జాప్ జిల్లా నాయకులు నక్కా  ఆంజనేయులు, రావాడ నాగరాజు, సారిక కుమార్ , కలమట శంకర్రావు నూకరాజు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు