తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవం,

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు,

జనం న్యూస్,నవంబర్ 14,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాల యాజమాన్యం  ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని పాఠశాల చిన్నారులు  గులాబీలతో అలంకరించి టెంకాయ  కొట్టి బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం సాయిలు,మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సంబోధించారు.పండిత్  జవహర్ లాల్ నెహ్రును, పిల్లలు చాచా నెహ్రూ, ("అంకుల్ నెహ్రూ") అని ముద్దుగా పిలిచేవారని అన్నారు.భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం.స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు.అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో,ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు.కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది అన్నారు.పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ అంతటి శాంతి,సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు.పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు అని అన్నారు.ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది.అందుకే ఆయన పుట్టిన రోజును  మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సంస్కృతిక ఉత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.అందరూ అనుభవించే బాల్యం..భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు.అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు.మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు.భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని అన్నారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుందని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.