తడ్కల్ హనుమాన్ మందిరంలో శ్రీ మహా గణపతి హోమం

తడ్కల్ హనుమాన్  మందిరంలో శ్రీ మహా  గణపతి హోమం

21క దంపతులతో మహా గణపతి హోమం వేద పండితులు, ఆలయ అర్చకులు కళ్యాణ్ జోషి

జనం న్యూస్,సెప్టెంబర్ 16,కంగ్టి   సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక హనుమాన్ మందిరంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహా గణపతి హోమాన్ని సోమవారం ఇరవై ఒక్క దంపతులతో వేదమంత్రాల ఉచ్చరణతో గణపతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేద  పండితులు కళ్యాణ్ జోషి,మాట్లాడుతూ వక్రతుండ మహాకాయ !
సూర్యకోటి సమప్రభ !!
నీర్ విజ్ఞం కురుమే దేవ్!
సర్వ కార్యేషు సర్వదా !!
అగజానన పద్మార్కం !
గజానన మహర్నిశం !!
అనేక దంతం భక్తానాం !
ఏకదంతం ఉపాస్మయే !!     మహాగణపతి హోమం నిర్వహించడంతో గ్రామస్తులకు,పశువుల  సంరక్షణతో పాటు,పాడి పంటలు,ధన ధాన్యాలు, దేహ రోగ బాధలను హరింపజేసే ఏకదంతా వక్రతుండుడని  అన్నారు.అనంతరం భక్తులకి మహా నీరాంజనాలు,తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనాలను అందించారు.  అనంతరం భక్తులకి మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు,  పురోహితులు,  దంపతులు,భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.