తెలంగాణ మణిహారం సాంకేతిక ఆర్ధికపరమైన రోడ్డు ఉత్తర 159 కి.మీ

తెలంగాణ మణిహారం సాంకేతిక ఆర్ధికపరమైన రోడ్డు ఉత్తర 159 కి.మీ

జనం న్యూస్ 14 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

✅తెలంగాణ మణిహారం రీజిన‌ల్ రింగు రోడ్డు ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి గారు స‌మావేశ‌మై రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను అందించి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.✅ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని. ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ✅ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. ✅తెలంగాణ‌లోని రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాలన్నారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళుతోంద‌ని, ఈ ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌ల నుంచి నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కోరారు. ✅పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.✅కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసిన వారిలో సీఎం గారితో పాటు పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, సురేష్ షేట్కర్ గారు, పోరిక బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గడ్డం వంశీ గారు, రాయసాయం రఘురామిరెడ్డి గారు, కడియం కావ్య గారు, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు.