నేవీ రాడార్ తో ప్రకృతి కి ముప్పు : రాష్ట్ర కార్యదర్శి వై గీత
జనం న్యూస్ సెప్టెంబర్ 30, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ప్రకృతి అందాలకు నిలయమైన దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రకృతికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు. ఇక్కడ ఎన్నో ఈ ప్రాంతంలో ఔషధ మొక్కలు అరుదైన పక్షులు జంతువులు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలంతా ఔషధ మొక్కలనుండి వచ్చే గాలితో మంచిగా ఆయురారోగ్యాలతో ఉన్నారు. నీవి రాడార్ ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజలతో పాటు పక్షులకు జంతువులకు ఉప్పు వాటిల్లుతుంది. ఇక్కడ 12 లక్షల చెట్లు నరికి వేయాలని నిర్ణయము దామగుండంలో రాడర్ స్టేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు.