ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

జనం న్యూస్ కోరుట్ల సెప్టెంబర్ 31 గిన్నెల శ్రీకాంత్ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరుట్లలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలతో అలరించారు. ఇందులో భాగంగా అందంగా తయారు చేసిన బతుకమ్మలలో ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఇన్. సాందీప్ , ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఈ. రాజకుమార్ , IQAC కోఆర్డినేటర్ డా. డి. సుఖప్రదాదేవి , అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.