పబ్లిక్ లో యువకుడిని చెప్పుతో కొట్టిన మహిళ..! ఎందుకో తెలుసా..? మీరే చూడండి.
జనం న్యూస్: మహిళలు పట్టపగలే బయట తిరగాలంటే భయంతో వణికి పోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో ఎక్కడో అక్కడ ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు హత్యలపరంపర కొనసాగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ద మహిళల వరకు ఆడవాళ్లను చూస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. పట్టపగలు బస్టాండ్ లో ఒక ఆకతాయి మహిళను వేధించాడు దానికి ఆ మహిళ యువకునికి సరైన బుద్ధి చెప్పింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురిలో ఓ మహిళ బస్టాండ్ వద్ద నిల్చోని ఉంది.. అటుగా వచ్చిన ఒక ఆకతాయి ఆ మహిళను చూసి కన్ను గీటాడు, మొదట ఆ మహిళ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మెల్లగా మహిళ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మహిళ చెప్పు తీసుకొని నలుగురు ముందు ఆకతాయికి బుద్ధి చెప్పింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు ఆ మహిళకు మద్దతు పలికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి మహళి, ఆకతాయి పేర్లు వెల్లడించలేదు. ఇటీవల ఒంటనిగా ఉన్న మహిళలకే కాదు.. పబ్లిక్ గా ఉన్నప్పటికీ రక్షణ లేకుండా పోతుంది. అంతమంది చూస్తుండగా మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి ఆ మహిళ దిమ్మతిరగే సమాధానం చెప్పింది.. చెప్పతో సన్మానం చేయడం సమంజసమే అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ఆకతాయిలకు సరైన బుద్ధి చెప్పిందని ఆ మహిళలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలకు ఇలాంటి ఆకతాయిలు తారసపడితే ఇలాగే బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారు