పీఎం దామరగిద్దలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి మాల ధారణ గావించిన దీక్షాపరులు
జనం న్యూస్ అక్టోబర్ 4, కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్దలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ప్రతిమాను ప్రతిష్టాపించి భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి దీక్ష మాల ధారణ దీక్షాపరులు పదిహేను మంది అమ్మవారి దీక్షను అనుసరించి చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదికాలంగా ఆది మాయ శక్తి అయినా పరమేశ్వరి భక్తి శ్రద్ధలతో సకల లోకములను కాపాడే తల్లి అని పూర్వీకుల ఆచార నియమాలతో అమ్మవారిని ప్రతిష్టాపించి మాలాధారణ గావించి జగన్మాతను భక్తితో కొలుస్తామని అన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో సకల ప్రాణికోటికి రోగ బాధలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉంచుతుందని, ఉంచాలని, మేము అమ్మవారి మాల ధారణ ప్రతి సంవత్సరము గావిస్తున్నామని అన్నారు.శుక్రవారం అమ్మవారి చండీయాగం నిర్వహించి హోమంలో పూర్ణాహుతి నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో వేద పండిత పురోహితులు, దీక్షాపరులు,గ్రామ పెద్దలు,వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.