ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలపై వేటు
జనం న్యూస్ 04 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా హైదరాబాద్:-ఇసుక అక్రమ రవాణ కట్టడిలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలపై వేటు వేస్తూ మల్టీజోన్-2 ఐజీపీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్ లో పెడుతున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఒక సీఐ సహా 14 మంది ఎస్ఐలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం వీఆర్ లో పెట్టిన వాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, అత్య కూర్(ఎస్), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ ఐలను వీఆర్ లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, త్వరలో వీరిని లూప్ లైన్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్ పల్లి, చండూర్, మాడుగుల పల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట్, బొంరాస్ పేట్, తాండూర్, చిన్నంబావి ఎస్సైలకు స్థానచలనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి, పర్యావరణ సమతుల్యతకు గండికొడుతున్న సుక అక్రమ రవాణా ఎక్కడ జరిగినా సంబంధిత అధికారులు భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా, గాంబ్లింగ్ , మట్కాలు సాగిన చోట సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే మైనర్ బాలిక పై జరిగిన రేప్ కేసు లో అలసత్వం, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినందునా వికారాబాద్ సీఐ ఎ. నాగరాజును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.