పోతులబోగూడ సుగుణ కంపెనీపై చర్యలు తీసుకోండి కంపెనీ ముందు కొంతాన్ పల్లి గ్రామస్తుల ఆందోళన..

పోతులబోగూడ సుగుణ కంపెనీపై చర్యలు తీసుకోండి కంపెనీ ముందు కొంతాన్ పల్లి గ్రామస్తుల ఆందోళన..

చెరువు నీటిని కలుషితం చేస్తున్నారని కొంతాన్ పల్లి, పోతులబోగూడ గ్రామస్తుల మండిపాటు....

పోతులబోగూడ సుగుణ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
 

  జన న్యూస్ నవంబర్8.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మెదక్ జిల్లాశివంపేట  
మండలంలోని పోతులబోగూడ గ్రామ శివారులో గల సుగుణ పౌల్ట్రీ పార్మ్ హౌసెస్ కంపెనీపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొంతాన్ పల్లి, పోతులబోగూడ గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. పోతులబోగూడ శివారులోని సుగుణ కంపెనీలోని కోడి ఎరువు, ఇతర కలుషిత పదార్థాలను కొంతాన్ పల్లి గ్రామ శివారులో పారబోయడం వల్ల అదంతా కొంతాన్ పల్లి గ్రామ చెరువులోకి వచ్చి చెరువు నీరంతా కలుషితం అవుతుందని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. చెరువులో కలుషిత నీళ్లు తాగి పశువులు, గంగపుత్రులకు జీవనదారమైన చేపలు చనిపోతున్నాయని, మహిళలు బట్టలు ఉతకడానికి కూడ వెళ్లి అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే చెరువులో స్నానం చేయకుండా ట్యాంకర్లు పెట్టుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నుండి వెదజల్లే దుర్వాసనతో పోతులబోగూడ గ్రామం నుండి కొంతాన్ పల్లి పాఠశాలకు విద్యార్థులు చదువుకోడానికి వెళ్లలేక పోతున్నారని మండిపడ్డారు. కంపెనీ చుట్టూ ప్రక్కల పొలాలలో ఏదైనా పంట వేస్తె చీడపీడలతో పంట పండటం లేదన్నారు. కాలుష్యకర వ్యర్థాలు, కోడి ఎరువును పారబోస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సుగుణ పార్మ్ హౌసెస్ కంపెనీపై చర్యలు చేపట్టాలని గతంలో ఎన్నోసార్లు ఉన్నతధికారులకు, ప్రజావాణిలో కూడ పిర్యాదు చేసిన అధికారులు చర్యలు చేపట్టలేదని, సుగుణ కంపెనీకి బడా నాయకుల అండదండలు ఉన్నాయని అందుకే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పోతులబోగూడ సుగుణ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.