ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమాత క్షేమం రైతుకి ఆదాయం
జనం న్యూస్ నవంబర్ 19 (రైల్వే కోడూరు నియోజకవర్గం)
ఓబులవారిపల్లి మండలం బాలిరెడ్డి పల్లె పంచాయతీ మరియు వై కోట పంచాయతీలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమము మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి మల్లిక విలేజ్ విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్ రామయ్య హాజరవడం మరియు అనిమల్ హాసిబండారీ అసిస్టెంట్ హరిత మరియు శ్రీదేవి హాజరు కావడం జరిగినది మరియు అనంతపురం జిల్లా నుండి శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్స్ స్టూడెంట్స్ హాజరు కావడం జరిగినది బాలిరెడ్డి పల్లె రైతు కాకర్ల వెంకటరామిరెడ్డి పొలంలో ప్రకృతి వ్యవసాయము దాదాపు రెండు సంవత్సరాల నుండి చేస్తున్నాడు ఈ రైతు ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో అరటి ప్రధాన పంట అంతర పంటగా మినుములు అలసంద మిరప గోంగూర తెల్ల గడ్డ కాకర టమోటా చుట్టూ బార్డర్ కాపు కంది వేయడం జరిగింది ఈ పంటకు బీజామృతం ఘనజీవామృతం ద్రవ జీవామృతం పెరుగుదలకు తెగులుకు కషాయాలు నియమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం చేయడం జరిగినది ఈ రైతు అరటి పంటలో ఆచ్చాదనా కలుపు రాకుండా త్యామశాతం ఉండే దానికి ఏవో మల్లికా ప్రతి రైతు కూడా ఇదేవిధంగా చేయాలని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది భూమికి ఆహారం కూడా ఇస్తాము భూమాతాకి మనము రకరకాల పంట మార్పు చేస్తే భూము లోపల పోషకాలు అన్నీ కూడా ఉత్పత్తిచెందుతాయి సూక్ష్మజీవులకు ఆహారం అందిస్తే భూమి కూడా మనకు అధిక ఆదాయాన్ని ఇస్తుంది కనుక ప్రతి రైతు కూడా ఇదేవిధంగా ఏ గ్రేడ్ మోడల్ లాగా పంటలు వేసుకోవాలి ప్రకృతి వ్యవసాయంలో ఎంసీఏ బుల్లయ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతున్నది ఐ సి ఆర్ పి లు రత్నమ్మ గంగాధర్ గురువులు రేవతి రెడ్డమ్మ ఆది రావడం జరిగినది బాబుల్ రెడ్డి రమణారెడ్డి మహేష్ కొంతమంది రైతులు కూడా ఆచరించడం జరిగినది.