ప్రతీ బూత్ కు వంద మంది సభ్యులను చేర్పించండి* యాళ్ల దొరబాబు*
జనం న్యూస్, సెప్టెంబర్ 30 కాట్రేనికోన
జిల్లాలో ప్రతీ బూత్ లోనూ వంద మంది సభ్యులను చేర్పించాలనీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు పేర్కొన్నారు. ఈరోజు కాట్రేనికోన గ్రామంలో జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ తన నివాసంలో బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు పాల్గొన్నారు జిల్లా బిజెపీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, గని శెట్టి వెంకటేశ్వరరావు డేగల వెంకటరమణ మరియు కాట్రేనికోన మండల నాయకులు తదితరులతో మండలంలో పార్టీ సభ్యత్వం పై సమీక్షను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనీ ఆయన కోరారు.