ఫోక్సో కేసులో నిందితుడికి జీవితకాల జైలుశిక్ష
-----రూ,1000, జరిమానా
-----రూ, 10 లక్షలు బాధితురాలకి నష్టపరిహారం
-----తీర్పు వెల్లడించిన పొక్సో న్యాయమూర్తి
రాజ్యలక్ష్మి
-----ట్రైల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తున్న జిల్లా ఎస్పీ
వి.రత్న ఐపీఎస్
జనం న్యూస్ నవంబర్ 12, (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం
ఫోక్సో కేసు లో ముద్దాయికి జీవిత కాలం శిక్ష తో పాటు వెయ్యి రూపాయల జరిమానా ను పొక్సో న్యాయమూర్తి
రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించారు,గోరంట్ల మండలంలోని నార్సింపల్లి గ్రామానికి చెందిన
గొల్ల ఆదినారాయణ (54)" తండ్రి లేట్ రామప్ప , శ్రీ సత్య సాయి జిల్లా అను అతనికి జీవిత ఖైదు జైలుశిక్ష,రూ. 1000./- జరిమానా.
బాధితురాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా పొక్సో న్యాయమూర్తి
రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించారు, కేసు వివరాలు...గోరంట్ల మండలం నార్సీంపల్లి గ్రామంలో 18.11.2020 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉండగా బాలిక (వయస్సు 5 సంవత్సరాలు) వారి ఇంటి వద్ద ఆడు కొనుచుండగా పై తెలిపిన ముద్దాయి,బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటిలోని పిలుచుకుని పోయి మానభంగం చేసినాడని,బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గోరంట్ల సీఐ జే.జయా నాయక్ కేసు నమోదు చేసి అనంతరం అప్పటి అనంతపురం దిశ మహిళ డీఎస్పీ.శ్రీనివాసులు,(ప్రస్తుత సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీ) కేసును దర్యాప్తు చేసి, దర్యాప్తు అనంతరం, ఫోక్సో కోర్టులో ఛార్జ్ షీట్ దాకాలు చేశారు.ఈ కేసు లో జడ్జి రాజ్యలక్ష్మి), 10 మంది సాక్షులను విచారించి నేరం రుజువైనందున 12.11.24 తేదీన ముద్దాయికు జీవిత ఖైదు జైలు శిక్ష రూ.1000/- జరిమానా విధించారు,బాధితురాలకు 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జడ్జి ఆదేశించారు,ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసు వారి తరఫున ఈ కేసు ను స్పెషల్ పిపి ఈశ్వరమ్మ ప్రాసిక్యూషన్ తరపున వాదించారు, జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు
గోరంట్ల సీఐ బోయ శేఖర్ పర్యవేక్షణలో
కోర్టు లైజర్ ఆఫీసర్ ఏ ఏస్ ఐ శ్రీనివాసులు,కోర్టు హెడ్ కానిస్టేబుల్ 1176 వి వి.నాయక్ ,కోర్టు కానిస్టేబుల్ .43, సుధాకర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి,లు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచి, నిందితుడికి శిక్ష పడేందుకు తమ వంతు కృషి చేసినా ఇతర అధికారులను జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు