బాలుడిని బలిగొన్న మస్కిటో కాయిల్...
దేశం లోని కుటుంబాలు చాలా వరకు దోమల బెడద తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్ వాడుతారు.. దోమలు చనిపోతున్నాయో లేదో తెలియదు కానీ వాటిని వాడుతున్న ఓ కుటుంబం మాత్రం అర్ధాంతరంగా తనువు చాలించారు... దోమల బాధ భరించలేక మస్కిటో కాయిల్ వెలిగిస్తే.. అది ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతిచెందగా, అందులో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్కు ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్కు ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబం గురువారం రాత్రి దోమలను నివారించేందుకు మస్కిటో కాయిల్‌ను వెలిగించి పడుకుంది. ఆ సమయంలో ఇంట్లో 9 మంది ఉన్నారు. మస్కిటో కాయిల్ పరుపుపై పడటంతో అది కొద్దికొద్దిగా అంటుకుంది. దీంతో గది నిండా పొగ అలుముకుంది. కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఉండటంతో పొగ బయటికి వెళ్లే అవకాశం లేకపోయింది. కాబట్టి మీరు కూడా మాస్కిటో కాయిల్స్ వాడేముందు జాగ్రత్త వహిస్తారు అని నిపుణులు అంటున్నారు...