భర్త ఏమో ఊర్లో పెద్ద మనిషి.. భార్య మాత్రం మంగళవారం సినిమాలో జమిందారీ భార్యలా..! విషయమేంటంటే..
జనం న్యూస్: ఈ రోజుల్లో భార్యా భర్తల మధ్య బంధం బీటలు వారడానికి కారణమౌతున్నాయి అక్రమ సంబంధాలు. జీవిత భాగస్వామి దగ్గర దొరకని పడక సుఖం కోసం, శారీరక వాంఛ కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఒళ్లు హూనం చేసుకోవడమే కాకుండా.. సంపాదన, ఆస్తి పాస్తులు తీసుకెళ్లి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వారికి దారా దత్తం చేస్తున్నారు. తెలియనంత వరకు చాటుమాటుగా వ్యవహారాలు సాగిపోతున్నాయి. తెలిసే సరికి మరింత బరితెగించేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే గొడవలు, తగాదాలు లేకుంటే జీవితాంతం వదిలేస్తామన్న బెదిరింపులు. తెలిసి అడ్డు తొలగించుకోవాలని కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు కొందరు. ఇందులో మహిళలు కూడా తక్కువేం కాదూ. పరాయి మగాడి కోసం తాళి కట్టిన భర్తను చంపేస్తున్నారు. Yఫోటోలో కనిపిస్తున్న మహిళను చూశారు కదా.. చక్కగా కనిపిస్తోంది కానీ.. తన ఐదో తనాన్ని తానే చెరిపేసుకున్న మహా ఇల్లాలు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూర్ సింగనూడి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజు నాయక్, స్నేహా భార్యా భర్తలు. రాజు బీజెపీ మాజీ తాలూకా పంచాయతీ సభ్యులు. ఊరిలో కాస్త పలుకుబడి ఉన్న మనిషి. ఈ గ్రామంలో గుడి కట్టేందుకు వచ్చాడు మహారాష్ట్రకు చెందిన ఓవ్యక్తి. స్నేహకు అతడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరు చాటుమాటుగా వ్యవహారం సాగించారు. అయితే ఈ విషయం భర్త రాజుకు తెలిసింది. తాను ఊరిలో కాస్త పేరు ఉందని, నీ అక్రమ సంబంధం గురించి ఊరిలో తెలిస్తే పరువుపోతుందని, ఆ సంబంధాన్ని కట్ చేసుకోవాలని భార్యకు సూచించాడు. అయినప్పటికీ.. స్నేహా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయమై రాజుకు, స్నేహకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఓ పథకం పన్నింది. భర్తకు కాస్త మద్యం వ్యసనం ఉండటంతో.. దీన్నే పావుగా వాడుకుంది. మద్యంలో నిద్ర మాత్రలు కలిపింది. తెలియక రాజు మద్యం సేవించి.. నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆమె గొంతు నులిమి హత్య చేసింది. అయితే అతడిది సాధారణ మరణం అనుకున్నారు. గొంతు మీద గాయాలుండటంతో పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలింది. స్నేహాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే.. ఇటీవల వచ్చిన మంగళవారం మూవీలో జమీందారి భార్య గుర్తుకు వస్తుంది కదా.