ఇప్పుడు చేయండి రా ప్రాంకులు.. పబ్లిక్ లో బెడిసికొట్టిన ప్రాంకు.. రోడ్డులో చితకొట్టిన ప్రజలు. ( వీడియో చూడండి).

ఇప్పుడు చేయండి రా ప్రాంకులు.. పబ్లిక్ లో బెడిసికొట్టిన ప్రాంకు.. రోడ్డులో చితకొట్టిన ప్రజలు. ( వీడియో చూడండి).

జనం న్యూస్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం చాలా మంది వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరహా ప్రయత్నాలలో ప్రాంక్ వీడియోలు కూడా ఒకటి అని చెప్పుకోవాలి. ఈ ప్రాంక్ వీడియోలు సర్వసాధారణంగా స్క్రిప్టెడ్‌గానే జరుగుతాయని చెప్పుకోవాలి. అయితే ఆ విషయం తెలియని కొందరు ప్రాంక్‌స్టర్స్.. పబ్లిక్‌ని సంప్రదించకుండానే వారిపై ప్రాంక్ చేస్తారు. అవే వారికి చెంపదెబ్బలుగా మారతాయి. ఇలా ప్రాంక్ చేసి చెంపదెబ్బ తిన్న ప్రాంక్‌స్టర్‌కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వేసుకుంటున్నారు. అవును, ఈ వీడియోను చూస్తే మీరు కూడా అలాగే నవ్వకుండా ఉండలేరు. అసలు ఆ వీడియోలో ఏం జరిగిదంటే. the_baigan_vines అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో.. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుండగా ప్రాంక్‌స్టర్ ప్రాంక్ చేద్దామని హర్న్ ఊదుతాడు. దీంతో రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఏంటి విషయం.. పిచ్చా అన్నట్లుగా అడుగుతాడు. ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ ప్రాంక్‌స్టర్ చెంప పగలకొడతాడు. అంతే ఆ ప్రాంక్‌స్టర్ మారు మాట్లాడక నిలబడిపోతాడు. అలాగే ఆ వ్యక్తి తన దారిన తాను వెళ్లిపోతాడు. ఇక ఈ వీడియోను నెట్టింట ప్రత్యక్షమవడంతో నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ‘ప్రాంక్ పేరుతో పబ్లిక్‌ని ఇబ్బంది పెడితే ఇలాగే జరగాల’ని కొందరు.. ‘ఫేమస్ అవ్వాలనే ఆశతో సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నార’ని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 48 వేల మంది లైక్ చేయగా.. 26 లక్షల మందికి పైగా వీక్షించారు.

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి 

https://www.instagram.com/p/Cp7AuEIh0d1/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again