మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు వైనే షాపులు బంద్.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు వైనే షాపులు బంద్.

జనం న్యూస్: ఆంధ్రపదేశ్‌లోని మందుబాబులకు చేదు వార్తే ఇది. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండటం చేత 3 రోజుల పాటూ వైన్ షాపులు, బార్లు క్లోజ్ అవ్వనున్నాయి.ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు మార్చి 13న జరగనున్న దృష్ట్యా జిల్లాలో 3 రోజుల పాటు అన్ని రకాల లిక్కర్ షాప్స్ మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రకటన జారీ చేశారు.జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గవర్నమెంట్ నడుపుతున్న లిక్కర్ షాప్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, స్టార్‌ హోటల్స్‌లోని బార్స్, టూరిజం బార్స్, నేవల్‌ క్యాంటీన్స్, మద్యం డిపోలు, కల్లు దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.అలాగే ఓట్ల కౌంటింగ్ జరిగే 16వ తేదీన కౌంటింగ్‌ సెంటర్స్ సమీప ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాప్స్ తెరవడం జరగదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాదు పట్టభద్రులు, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగే జిల్లాల్లో కూడా మద్యం దుకాణాలు మూతపడతాయి.