మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం
స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు
జనం న్యూస్ 2024 నవంబర్ 7 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)
గురువారం రాయిన్ పల్లి ప్రాజెక్ట్ రాయిన్ పల్లి గ్రామములో 100% రాయితీ పై చెప పిల్లల విడుదల కార్యక్రమం మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగాశాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలోఒక లక్ష 13 వేల 672 చేప పిల్లలను 1 లక్ష 80 వేల ఖర్చుతో చేప పిల్లలను విడుదల చేసినట్లు చెప్పారు.మెదక్ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ 100% రాయితీతో అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించి, వారి జీవితాలలో వెలుగులు నింపాలనేదే ఆశయంగా పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగాఉంటుందని,మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమాచేశామనిమత్స్యకారులకు చేపలను అమ్మేందుకు 10 లక్షల విలువచేసే వాహనాలను 40% సబ్సిడీతోఅందిస్తున్నట్లుతెలిపారు. అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 66 లక్షల చేప పిల్లలను దాదాపు 82 చెరువులల్లో ఉచితంగా విడుదల చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు.చేప పిల్లలను పెంచి, వాటి ఉపాధిని పొందాలన్నారు. .ఈ కార్యక్రమంలోజిల్లా ఫిషర్ మెన్కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుమానేగాళ్ళరాంకిష్టయ్య,డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీష్ హనుమంతరావు జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం,ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, అరి లక్ష్మణ్, మత్స్యశాఖసిబ్బంది సంతోష్,భరత్,డేవిడ్ మల్లేష్ జయరాం,యాదగిరి, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.