మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.
జనం న్యూస్ 05 నవంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా : - మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షి టీమ్స్ ను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెలలో జిల్లా లో షి టీం చేపట్టినా కార్యక్రమాల గురించి, షి టీమ్ పని తీరు, ప్రజలు షి టీం ను ఉపయోగించాల్సిన అంశాల గురించి తెలియజేశారు.
విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ లేదా పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని ఎస్పీ తెలిపారు. షీటీమ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ అక్టోబర్ మాసంలో
58 హాట్స్పాట్స్ ను సందర్శిoచి నిఘా ఉంచడం జరిగిందనీ, వేదింపులకు సంబందించి 07 పిర్యాదులు రాగ 05 FIR కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ అన్నారు. మరియు
04 రెడ్ హ్యాండెడ్ కేసులు,
06పెట్టి కేసు లు నమోదు చేసినట్లు వివరాలను వెల్లడించారు.
మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షి టీమ్స్ ను నేరుగా సంప్రదించలేని వారు 8712670312ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. షీటీమ్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్, డిగ్రీ కాలేజీ లో, ఇంటర్ కాలేజి లో, స్కూల్స్ లో" మొత్తం 17 అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా కళా బృందాల ద్వారా కూడా షి టీం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎస్పి తెలిపారు. ఒక ఇంట్లో ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 5 గురు వ్యక్తులు అరెస్ట్, కేసు నమోదు చేసిన ఐజ పోలీసులు ఐజ పట్టణం లోని ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు నమ్మదగిన సమచారం రాగా జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది ,ఐ జ ఎస్సై విజయ్ భాస్కర్, సిబ్బంది సంయుక్తంగా నిఘా ఉంచి ఐజ పట్టణం లోని ఒక ఇంట్లో ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 5 గురి వ్యక్తులను గుర్తించి వారి నుండి 1,04,860/- రూపాయాల నగదు 5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. అనంతరం ఐజ పోలీస్ స్టేషన్ లో అట్టి వారి పై ఎస్సై విజయ్ భాస్కర్ కేసు నమోదు చెయ్యడం జరిగింది.
నిందితుల వివరాలు
1. వడ్ల కృష్ణ s/o మద్దిలేటి , ఐజ.
2. చాకలి సతీష్ కుమార్ s/o నర్సింహులు, ఐజ.
3. గుడికాటి నవదీప్ s/o లెట్ రామచంద్రుడు, ఐజ.
4. వెంకటేశ్ s/o మద్దన్న, మాన్ దొడ్డి, రాజోలి
5. MD కరీం s/o చాంద్ పాషా, మాన్ దొడ్డి, రాజోలి.