రామోజీరావు కన్నుమూత..

రామోజీరావు కన్నుమూత..

జనం న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.