క్షేత్ర స్థాయిలో బాధితులకు మహిళా సంరక్షణ పోలీసులు భరోసా కల్పించాలి

క్షేత్ర స్థాయిలో బాధితులకు మహిళా సంరక్షణ పోలీసులు భరోసా కల్పించాలి

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 21 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు నవంబరు 20న రాజాం పోలీసు స్టేషను సందర్శించి, మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాల పోలీసు సిబ్బందితో మమేకమై,  క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది పాత్ర క్షేత్ర స్థాయిలో క్రియాశీలకం అన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న నేరాలు, శాంతిభద్రతల సమస్యలు, బెల్టు షాపులు, గంజాయి వినియోగదారులు, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి, సంబంధిత పోలీసు అధికారికి అందించాలన్నారు.గ్రామ స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గురించి, అసాంఘిక కార్యకాపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా సేకరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.సైబరు మోసాలు, డిజిటల్ అరెస్టు, గంజాయి, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, రోడ్డు సేఫ్టీ, మహిళా రక్షణకు సంబంధించి ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా సైబరు మోసానికి గురైతే 1930కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ఫిర్యాదు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారుతమ గ్రామ/వార్డు పరిధిలో నివసించే పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, వారు చేస్తున్న వృత్తులు, వారి ప్రస్తుత నడవడిక, జీవన విధానం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని, అధికారులకు ఎప్పటికపుడు తెలియజేయాలన్నారు.గ్రామ స్థాయిలో మహిళా సంరక్షణ పోలీసులు నిర్వహించాల్సిన విధులు చాలా క్రియాశీలకమని, విధుల్లో అశ్రద్ధ వద్దని, ప్రజలతో తరుచూ మమేకమవుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారాన్ని ముందుగా సేకరించాలన్నారు.గ్రామంలో కక్షలు, గ్రూపు తగాదాలు, భూతగాదాలు, కొట్లాటలు, పార్టీ తగాదాలు, నేరస్తుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. పోలీసు స్టేషనులో పని చేసే పోలీసు సిబ్బందికి కేటాయించిన దత్తత గ్రామాన్ని వారంలో ఒక రోజు సందర్శించి, గ్రామస్తులతో మమేకమై గ్రామంలో పరిస్థితులను స్టేషన్ అధికారికి నివేదించాలని MSPలు, దత్తత పోలీసులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్దేశం చేసారు.గ్రామాల్లో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, స్థానికులతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా MSPలు, దత్తత గ్రామ పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.గ్రామంలో బాధితులను కలిసి వారు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు దర్యాప్తు ఏవిధంగా జరుగుతున్నది, కేసు దర్యాప్తులో పరిణామాలను తెలియజేసి, బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్., రాజాం సిఐ కే.అశోక్ కుమార్, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్సై రవి కిరణ్ మరియు ఇతర పోలీసు అధికారులు, MSPలు, దత్తత పోలీసులు పాల్గొన్నారు.