రీల్స్ పిచ్చితో పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టిన తల్లి.. వీడియో చూసి చీ అంటున్న ప్రజలు.

జనం న్యూస్: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు చేసి, వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ వ్యామోహంలో పడి చాలా మంది ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. కొంతమంది తమ ఆన్‌లైన్ పాపులారిటీ కోసం, తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో ఈ మాటలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ఈ వీడియోలో ఒక తల్లి తన బిడ్డను అజాగ్రత్తగా పట్టుకుని, ఎలా పడితే అలా ఊపేస్తూ సోషల్ మీడియా రీల్ కోసం ప్రయత్నించడం కనిపించింది. ఈ వీడియోను "నిశాంత్ అనే యూజర్ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారు షాక్ అయ్యారు, దీనిపై విస్తృతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో, ఒక తల్లి తన చిన్న బిడ్డను నడుముపై ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ వీడియో తీస్తుంది. ఆమె వీడియోలో ఎక్కువగా మునిగిపోవడం వల్ల బిడ్డపై ఆమె పట్టు నుంచి జారడం జరుగుతుంది. దీంతో బిడ్డ కింద పడి, తల గోడకు గట్టిగా తాకుతుంది. ఈ ఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది, బిడ్డ వెంటనే నొప్పితో ఏడుపు మొదలుపెడుతుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దృష్టిని ఆకర్షించింది, వినియోగదారుల తీవ్రంగా ఆమెను విమర్శించారు. చాలా మంది తల్లి అజాగ్రత్తను చూసి భయపడ్డారు, సోషల్ మీడియా పట్ల ఆమెకు ఉన్న వ్యామోహం, ప్రమాదకరమైన పరిణామాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వీడియో కామెంట్ సెక్షన్‌లో డిమాండ్ చేశారు.వీడియోపై వచ్చిన వ్యాఖ్యలు ఈ ఘటనపై ప్రజల ఆందోళనను స్పష్టంగా చూపిస్తాయి. ఒక వ్యక్తి తల్లి ఇలా ప్రవర్తిస్తుందంటే నమ్మలేకపోతున్నా అని వ్యాఖ్యానించారు, బిడ్డకు కలిగిన నొప్పి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల తలపెట్టే ఇలాంటి ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడానికి చట్టాలు ఉండాలని మరొక వ్యక్తి సూచించారు. పిల్లల భద్రతను పణంగా పెట్టి అయినా ఆన్‌లైన్ గుర్తింపు పొందాలనే కోరిక చాలా మందిలో ఎక్కువగా ఉండటంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు