రేషన్ బియ్యంఅక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

రేషన్ బియ్యంఅక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

రేషన్ బియ్యం కలిగిన ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి.. జనం న్యూస్ డిసెంబర్10.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేసి రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు శివ్వంపేట ఎస్సై మధుకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన ధరావత్ లింగం మండలంలోని గ్రామాలలో తిరుగుతూ తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ ఎక్కువ ధరకు రైస్ మిల్లులకు అమ్ముకుని లాభాలు పొందుతూ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం అందుకొని హుటాహుటిన ఉసిరిక పల్లి గ్రామ శివారు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామని అందులో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.  రేషన్ బియ్యం పట్టుకున్న విషయాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని, సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి, అవి 11 క్వింటాల్లా రేషన్ బియ్యంగా నిర్ధారించారని ఆయన తెలిపారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.