విద్యల నగరం విజయనగరం అనే నానుడి ని నిజం చేసిన అమ్మాయి
జనం న్యూస్ 05 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరానికి చెందిన ముళ్ళు ప్రమీల గత 2 ఏళ్లుగా విజయనగరం లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ గ్రౌండ్ లో పోలీస్ మరియు ఆర్మీ ఉద్యోగం కోసం డి అనిల్ కుమార్ (విజయనగరం డిఫెన్స్ మరియూ పోలీస్ అకాడమీ) డైరెక్టర్ ఆధ్వర్యం లో శిక్షణ పొందుతుంది.. గత సెప్టెంబర్ 23నుండి ఎస్ ఎస్ సి జి డి కనిస్టేబుల్ బాల బాలికలకు ఈవెంట్స్ విశాఖపట్నం లో జరుగుతున్నవి . బాలికలకు 24 అక్టోబర్ నుండి 1600 మీటర్లు 08:30 లోపు కంప్లీట్ చెయ్యాలి. నిన్న జరిగిన ఎస్ ఎస్ సి జిడి ఫిజికల్ ఈవెంట్ లో జిల్లా బెస్ట్ గా 06:07 లో కంప్లీట్ చేసి టాపర్ గా నిలిచింది. ఆమె మాట్లాడుతూ తన శిక్షణ కోసం గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఈ జన్మ అంతా రుణపడి ఉంటాను అని చెప్పుకుని ఆనందాభాస్పాలను వ్యక్తం చేసింది.. పీటీసీ లో ఉన్న ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు లేకపోతే తనకి ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు అని మీడియా కి చెప్పారు మెళుకువలు నేర్పిన పీటీసీ ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారు కు మరియు ఆర్ ఐ లకు మరియు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తల్లితండ్రులు తరువాత అంతటి ప్రోత్సాహం ఇచ్చిన విజయనగరం పోలీస్ ట్రైనింగ్ అధికారులకు ఎం ఇచ్చిన రుణం తీర్చుకోలేను అని వాపోయింది ఇంతటి విజయాన్న సాధించినందుకు ప్రోత్సహించిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు అని పేర్కొంది. విజయనగరం డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎస్ ఎస్ సి జీడీ కానిస్టబుల్ ఈవెంట్స్ కి వెళ్లిన 6 మంది అబ్బాయిలు 01 అమ్మాయి 100% రిజల్ట్ తో పూర్తి చేశారు అని పేర్కొని తను అడగనే గ్రౌండ్ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన పీటీసీ ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే 2024 లో ఆర్మీ ర్యాలీ లో 14 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు కూడా తెలిపారు. ఇది కేవలం పీటీసీ వారి ప్రోత్సాహం వల్లనే జరిగింది అని ఆనందం వ్యక్తం చేశారు.