సివిల్ సప్లై కార్మికులకు కనీస వేతనాలు జీవో ప్రకారం అమలు చేయాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసరావు డిమాండ్
జనం న్యూస్ టుడే; కల్లూరు
ఖమ్మం జిల్లా , కల్లూరు మండలం, కల్లూరు.
పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా సివిల్ సప్లై లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు వేతనాలు పెంచాలని ఎగమతులు దిగుమతులకు క్వింటాకు 35 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు శుక్రవారం కల్లూరు సివిల్ సప్లై గోదాం వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో వారుపాల్గొని మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా హమాలీల కార్మికుల బతుకులు మారడం లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. సివిల్ సప్లై లో పనిచేస్తున్న హమాలి కార్మికుల వేతన ఒప్పందం 2024 జనవరి నెలలో ముగిసిందని అప్పటినుంచి ఇప్పటివరకు వేతన ఒప్పందాల గురించి అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో ఈ కార్మికులకు పిఎఫ్,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారని, అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని సంవత్సరాల నుండి ఇన్సూరెన్స్ పిఎఫ్ ప్రభుత్వాలు చెల్లించడం లేదనిఅన్నారు. సివిల్ సప్లై అధికారులతో జరగబోయే చర్చలలో హమాలీ కార్మికులకు, కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ,ఇన్సూరెన్స్, సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు, కార్మికులకు ఎక్కడ విశ్రాంతి గదులు అవసరం ఉంటే ఏర్పాటు చేయాలని కోరారు. సివిల్ సప్లై పాయింట్లలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ చెల్లించబడి ఉంది. వాళ్ల పేర్లలో తప్పులు ఉండబట్టి, కేవైసీ కాక అప్డేట్ లేకపోవడం వలన కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీఎఫ్ ఉన్న కార్మికులు 58 సంవత్సరాల వయసు పూర్తయిన వారికి, పది సంవత్సరాల సర్వీసు ఉండే కార్మికుడికి పెన్షన్ వస్తుంది. వృద్ధాప్య పెన్షన్ తో సంబంధం లేకుండా ప్రోవిడెంట్ ఫండ్ వలన వచ్చే పెన్షన్ ఇది. వృద్ధాప్య పెన్షన్, డిజబులిటీ పెన్షన్ వస్తుందని, పీఎఫ్ పెన్షన్ కు దరఖాస్తు చేసుకొనీ కార్మికులు ఉన్నారు. కార్మికుడు 58 సంవత్సరాల లోపు సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ కార్మికుడి కుటుంబానికి ఈ డి ఎల్ ఐ ఇన్సూరెన్స్ కింద 7: 50 లక్షల వరకు సహాయం అందుతుంది. అలాగే భార్యకు, 25 సంవత్సరాల వయసు లోపు ఉండే పిల్లలకు పెన్షన్ చెల్లించబడుతుంది. అలాగే ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన కార్మికుడికి ఆయన సర్వీస్ కాలాన్ని బట్టి గ్రాటిటీ చెల్లించాలి. తదితర డిమాండ్స్ తో కార్మిక వర్గం సివిల్ సప్లై అధికారులతో జరిగే చర్చల్లో ఈ విషయాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని వారు తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రగతిశీల హమాలి అండ్ మిల్లు వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కే పుల్లారావు ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లగట్ల సీతారాములు కల్లూరుసివిల్ సప్లైహమాలీ కార్మికులు ముత్తయ్య ఆనంద్ రావు వెంకటేష్, కృష్ణ చందర్రావు పున్నయ్య ఉపేందర్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.