సెలవు రోజుల్లో తరగతులను అడ్డుకున్న SFI విగ్రహాల మాదిరిగా అధికారుల తీరు

సెలవు రోజుల్లో తరగతులను అడ్డుకున్న SFI విగ్రహాల మాదిరిగా అధికారుల తీరు

విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించి మూడు రోజులు గడుస్తున్న విజయనగరం జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ పలు కళాశాలలు, పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి. వీటిపై వచ్చిన సమాచారంతో ఎస్ఎఫ్ఐ బృందం ఆయా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను సందర్శించి తనిఖీ నిర్వహించారు. తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు సెలవులు ప్రకటించి ఇళ్ళకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు కే రాజు మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పలు విద్యాసంస్థలు ఇప్పటికీ దసరా సెలవులు ప్రకటించలేదని , విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సెలవల్లోనే వారు వారి స్వస్థలాలకు వెళ్లడం, వారి బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారిలో మానసికల్లాసం కలిగించే విధంగా ఈ సెలవలను ఉపయోగించుకుంటారని తెలిపారు . అటువంటిది ఇప్పటివరకు సెలవులు ప్రకటించకపోవడం సిగ్గుచేయడానికి విమర్శించారు .ఒకపక్క అధికారులు మూడో తారీకు నుంచి సెలవులు ఇచ్చామని చెప్తుంటే ఈరోజు ఆరో తారీఖు అవుతున్న అది కూడా ఆదివారం అవుతున్న ఇప్పటికీ తరగతులు నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఖండిస్తోందని తెలిపారు. తక్షణమే అధికారులు మొద్దు నిద్దుర వీడి తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను , కళాశాలలను సందర్శించి చర్యలు తీసుకొని సెలవులు ప్రకటించే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో దసరా సెలవు ఇవ్వకుండా రేపటి నుంచి ఏ యాజమాన్యం తరగతులు నిర్వహించిన ఎస్ఎఫ్ఐకి సమాచారం ఇవ్వాలని, విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోమేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు గుణ, మురళి, వాసు ,అర్జున్ తదితరులు పాల్గొన్నారు.