అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.

అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.
జనం న్యూస్ 18 అక్టోబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.
- జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు
గద్వాల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం  "పోలీస్ ఫ్లాగ్ డే " సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21వ తేది నుండి అక్టోబర్ 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని,  ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చెయ్యాలని జిల్లా ఎస్పీ  టి శ్రీనివాస రావు  తెలియజేశారు. పోలీస్ సంస్మరణ కార్యక్రమాలలో బాగంగా..అక్టోబరు 21 నుండి 24వ తేది వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, షి టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్, డాగ్ స్క్వాడ్ విభాగాల విధులు, ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలగునవి  విషయాలను ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో అనగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును. వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా  కేటగిరి-1 : స్టూడెంట్స్ కు  ఇంటర్మీడియట్  వరకు Judicious usages of mobile (విచక్షణతో కూడిన మొబైల్ వాడకం),  కేటగిరి-2:  డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ కు my role on making Telangana a drug  free state (తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర) అనే అంశాల మీద విద్యార్థులకు "ఆన్లైన్ నందు  వ్యాసరచన పోటీలు  నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 24 అక్టోబర్ 2024 వరకు సమర్పించవచ్చును. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు. పోలీసులకు వ్యాసరచన పోటీలు: *కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు.. “My role in improving Police image in society”( సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర) కేటగిరి-2 : ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు “Sound mind in a sound body” (దృఢమైన శరీరంలో దృఢమైన మనసు) వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ వ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలకు మించకుండా  వ్యాసరచనలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం మరియు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు.
 రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు : విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను జిల్లా స్థాయిలో లో  బహుమతి ప్రధానం చేస్తూ, రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఫోటోలు, వీడియోలు ఈనెల తేది: 22-10-24 లోపు  జిల్లా పోలీస్  కార్యాలయంలో PRO కు అందించాలి. ఈ నెల 21వ తేదీ నుండి  31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందనీ జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ నెల అక్టోబర్ 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు "పోలీస్ అమరవీరులను స్మరిస్తూ  ప్రముఖులు  ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని తెలియజేశారు