రాబోయే రోజుల్లో శాంతి నగర్లో ఇంకొందరు ఉద్యోగుల్ని చూడాలి:- ఎ ఎం సి చైర్మన్
(జనం న్యూస్) నవంబర్ 5 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్ :- కల్లూరు మండల పరిధి లో గల శాంతినగర్ లో డీఎస్సీ 2024 ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు అభినందన సభ శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ, శాంతినగర్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజా హాజరయ్యారు. డీఎస్సీ 2024 సంవత్సరంలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాన్ని సాధించిన శాంతినగర్ వాసులు గద్దల కళ్యాణి అలాగే నడ్డి కళ్యాణి , కోటా వెంకటేశ్వర్లను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతినగర్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ నిత్యం శాంతినగర్ లోని సమస్యల పరిష్కారం కోసం, డెవలప్మెంట్ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు . రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించి శాంతినగర్ కి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, శాంతినగర్ను ముందుండి నడిపిస్తున్న డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు శాంతినగర్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని, రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళను నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా వారికి తెలిపారు. స్థానిక నాయకులు, పెద్దలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎస్ డి ఎస్, కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షులు ఖమ్మంపాటి వీరస్వామి , కనకపుడి జయరాజు ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు (కె.వి), కిన్నెర నాగరాజు, కంచపోగు ఉపేంద్ర , ఖమ్మంపాటి ప్రశాంత్, కొత్తపల్లి వీరేంద్ర, అద్దంకి అనిల్ , మోదుగు సతీష్, ప్రసన్న కుమార్, మేడి సీతారాములు , రావూరి సీతారాములు, మాతిపోగు సతీష్ , ఖమ్మంపాటి అప్పారావు, కంటిపూడి గాబ్రియల్ , మాజీ ఎంపీటీసీ కొండూరి కిరణ్ , ఉపాధ్యాయులు గుర్రాల సుధీర్ కుమార్, గౌరవ సలహాదారులు గుర్రాల సత్యానందం, పెద్దలు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, యంగల పెంటయ్య, శ్రీనివాసరావు, స్థానిక మహిళలు, యువకులు హాజరయ్యారు.