అనుకొని ప్రమాదం వల్ల చేతిని పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న వ్యక్తి
అనుకోని ప్రమాదం వల్ల చేతిని పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న వ్యక్తికి తమ సహకారం అందించిన అంబేద్కర్ అక్షరీయం టీం. మీరు కూడా సహాయం అందించండి.
జనం న్యూస్: తల్లి ఓ సాధారణ గృహిణి, తండ్రి చంద్రశేఖర్ ఓ షాపులో చిన్న గుమాస్తా. వీరిది సాధాఅనుకొని ప్రమాదం వల్ల చేతిని పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న వ్యక్తిరణ పేద కుటుంబం, తండ్రి దీర్ఘకాలికంగా జన్మతహా సింగిల్ కిడ్నీ డిజార్డర్ మరియు షూగ్ర్ వ్యాధిగ్రస్థుడు కాగా తల్లి సైతం కాళ్ళ నరాల వాపు సమస్యతో భాద పడుతున్నారు. వీరికి 2007లో ప్రభుత్వం నుండి మంజూరైన ఒంటి గది ఇంట్లో తొండపాడు గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లాలో నివశిస్తున్నారు. నవీన్ పదో తరగతి ముగిసాకా ఇంటి పరిస్థితులను ఆకళింపు చేసుకొని పెద్ద చదువులకు వెళ్ళడం కష్టమని, రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబానికి తోడుగా అండగా నిలబడ్డాలని ఆలోచించి ఐటీఐ కోర్స్ ముగించుకొని చేతికందిన పనులను చేస్తూ మెల్లగా ఎలాగో పెనుకొండ వద్దున్న కియాలో తన అర్హతకు నైపుణ్యానికి తగిన పని సంపాయించుకొని రెండేండ్లు హాయిగా గడచిపోతున్న తరుణంలో అక్టోబర్ 8-2023 తేదీ రాత్రి నసనకోటకు వెళ్ళి టూ వీలర్లో తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఓ ఫోర్ వీలర్ ఢీ కొట్టడంతో జరిగిన యాక్సిడెంట్లో ఈ యువకుడు అపస్మారక స్థితికి చేరుకోగా వెన్నంటి వున్న స్నేహితులు వెనువెంటనే అనంతపురం పెద్దాసుపత్రికి తరలించగా, అబ్బాయి స్థితిని చూసిన డాక్టర్లు వెంటనే బెంగళూరికి కానీ హైద్రాబాదుకి కానీ తీసుకెళ్ళమని సూచించగా అతని తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ త్రోవబట్టారు. కర్నూలు వద్ద పరిస్థితి పరిశీలించిన ఆ ఆంబులెన్స్ డ్రైవర్ సలహా మేరకు దిక్కుతోచని ఆ అబ్బాయి తల్లిదండ్రులు తమ బిడ్డ బతికితే చాలని కర్నూలులో ఓ ప్రైవేట్ హాస్పటల్లో జాయిన్ చేసారు. రాత్రికి రాత్రే ఆ యువకుడికి కుడి చేయిని శస్త్ర చికిత్స చేసి భుజం దాకా తొలగించి, కుడి కాలికి సైతం మూడు చోట్ల రాడ్లు బిగించి ఆ అబ్బాయికి ప్రాణం పోసారు అక్కడి వైద్యులు. ఆ అబ్బాయి ప్రాణం పోసుకొని ఇంటికి వికలాంగుడిగా తిరిగొచ్చాడంటే అందుకు కారణం ఆ అబ్బాయి మిత్రులే ఇతర ఉదారవాదుల అర్థిక సహాయ సహకారాలతో అని చెప్పొచ్చు, ఎందుకంటే వీరికి దాదాపూ పదిలక్షల పైచిలుకు ఖర్చయ్యింది. విచారకరమైన విషయమేమంటే వీరికి ఎవరూ వెన్నుదన్నుగా నిలబడక పోవడం వల్లనూ, సరైన సలహా ఇచ్చేవారు కూడా కరువైనందు వల్లనూ, వీరు అబ్బాయి ప్రాణం దక్కితే చాలనే హడావిడి గందరగోళంలో అప్పులు చేసో వారి వీరి నుండి అర్థించో ముందుకెళ్ళారు కానీ ఈ అబ్బాయికి కియా ఉద్యోగపరంగా వున్న ఎల్ఐసీ వాడుకోలేకపోయారు. వికలాంగత్వం వల్ల చేస్తున్న ఉద్యోగమూ పోయింది పెద్దగా కియా వల్ల ఈ అబ్బాయికి పెద్దగా ఒరిగింది ఏమీలేదనే చెప్పాలి. వీరు అవగాహనా లోపంతో ఆపరేషన్ జరిగిన ఆసుపత్రి నుండి సరైన పత్రాలు తీసుకోకపోవడం వల్ల ఆర్డీటీకి అప్లై చేసుకున్న సహాయపు అభ్యర్థన తోసిపుచ్చబడింది. వాల్లూ వీల్లూ చెప్పగా ఆలస్యంగా కళ్ళు తెరచిన వీరు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతపు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళగా ఈ అబ్బాయిని ఢీకొట్టిన వెహికల్‌ను పోలీసులు వారం పాటూ స్టేషన్లోనే వుంచుకొని ఫిర్యాదుదారులు ఎవరూ రాకపోవడంతో వదిలేసారట! పైగా ఒకవేళ ఇప్పుడు కేసు పెట్టినా మీ అబ్బాయిదే తప్పు రాంగ్ సైడులో తనే వెళ్ళి గుద్దుకున్నాడు ఆ వెహికల్‌కు తీవ్రంగా డ్యామేజీ అయ్యింది దాన్ని మీరే కట్టించాలని హుంకరించడంతో కండ్లలో నీరు కుక్కుకొని పెదవిని అణచుకొని వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ అబ్బాయి వికలాంగుల ఫించన్ కోసం అప్లై చేసి మంజూరు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు ఈ అబ్బాయి తెలిసిన వారి ద్వారా అంబేద్కర్ అక్షరీయం టీం గురించి విని ఆ టీం సభ్యులు చామలూరు రాజగోపాల్ మరియు సంగీతవాణీ రాయుడు గార్లను కలిసి తనకు కృత్రిమ చేతికి అవసరమైన ధన సహాయాన్ని ఎవరైనా దాతల ద్వారా అందించగలిగితే తాను తన జీవనాన్ని ఏదో ఒక పని చేసి జీవించగలననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు. వెంటనే స్పందించిన అంబేద్కర్ అక్షరీయం టీం సభ్యులు ఆర్.డీ.టీ ఛైర్మన్ మ్యాక్చో ఫెర్రర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళగా తప్పకుండా సాయం చేస్తామని మాటివ్వడంతో నవీన్ బాబు మ్యాంచో ఫెర్రర్ గారికి ఆర్.డీ.టీ సంస్థకు మరియు అంబేద్కర్ అక్షరీయం టీంకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
దాతలెవరైనా ఈ అబ్బాయికి సాయం చేయాలనుకుంటే ఫోన్ పే/ జీ పే నంబర్ 70931 35321కు గానీ లేదా
Pinnepalli Naveen Babu
SBI Acc no 34459827550
IFSC 0011125 కు
మీకు తోచిన సహాయం డైరక్టుగా అందించి ఆ అబ్బాయి తన స్వశక్తిని కూడగట్టుకోవడానికి సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము.