ఇంత దారుణమా.. ట్రాఫిక్ మధ్యలో నగ్నంగా తిరుగుతున్న మహిళ..వీడియోలు తీస్తూ చీ..చీ (వీడియో చూడండి)

జనం న్యూస్: ఇంత దారుణమా, రద్దీ రోడ్ల మీద మహిళ నగ్నంగా వెళుతుంటే కప్పుకోవడానికి బట్టలు ఇవ్వకూండా కెమెరాలకు పని చెప్పిన వాహనదారులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ నగర్ చౌరాహా వద్ద రద్దీగా ఉండే రహదారిపై ఓ మహిళ నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది. బిజీ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతున్న మహిళకు సహాయం చేయడానికి లేదా ఆమెకు దుస్తులు అందించడానికి లేదా ఆమె సమస్య ఏమిటి తెలుసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. రెండు రోజుల క్రితం చిత్రీకరించబడిన ఈ 10 సెకన్ల క్లిప్ భారీ ట్రాఫిక్ మధ్య, వాహనాలు, పాదచారులు ప్రయాణిస్తున్న బిజీ రోడ్డు మీద మహిళ బట్టలు లేకుండా నడవడం చూపిస్తోంది. ఈ ఘటన శాంతిభద్రతలపై తీవ్ర దుమారం రేపింది. పోలీస్ బూత్ సమీపంలో ఉన్నప్పటికీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. బుధవారం రాత్రి వీడియో ఆన్‌లైన్‌లో కనిపించే వరకు అధికారులకు ఈ సంగతి తెలియదు. అయితే ఈ మహిళ యొక్క గుర్తింపు, ఎందుకు నగ్నంగా రోడ్లపై తిరిగింది అనే సంగతి ఇంకా తెలియలేదు.