ఎయిర్ పోర్టులో బట్టలు చించుకొని మరీ పిచ్చ కొట్టుడు కొట్టుకున్న ప్రయాణికులు (వీడియో చూడండి).

జనం న్యూస్: వీధి నల్లాల వద్ద మహిళలు తన్నుకోవటం చూశాం. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. చివరకు మెట్రోలో సీటు కోసం కూడా మహిళలు కొట్టుకున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ కావటం కూడా చూశాం. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చూశారా..? అవును మీరు చదివింది నిజమే.. దీన్ని విమానాల్లో ప్రయాణించే వాళ్లంతా మహా క్లాస్‌ అనుకుంటే పొరపాటే.. వారిలోనూ ఊరమాస్‌ మనుషులు చాలా ఎక్కువగానే ఉంటారు. సందర్భం రావాలేగానీ, బస్తీల్లో కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలోని షికాగోలో వెలుగులోకి వచ్చింది. అమెరికాలో అంతా సంస్కారవంతులే అనుకుంటే పొరపాటే. షికాగో ఎయిర్‌పోర్టులో లగేజ్‌ తీసుకునేచోట ప్రయాణికుల మధ్య మాటామాటా పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది. ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గొడవ ల్యాండ్ అవుతున్నప్పుడు చెప్పిన దానితో మొదలయ్యింది, అది కాస్త చినికిచినికి గాలివానగా మారింది. అయితే గొడవపడినవారంతా యువతులే. 24 ఏళ్ల మహిళపై ముష్టిఘాతాలు విసిరిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్రంగా తన్నుకుంటున్న వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. అది కూడా అమెరికాలో ఇలాంటి ఘటన జరగటం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.