డ్యాన్స్ చేస్తూ లైవ్ లో కుప్పకూలి చనిపోయిన వ్యక్తి. చూస్తే షాక్ అవుతారు (వీడియో చూడండి)
జనం న్యూస్: దేశంలో కరోనా ప్రభావం ఎంతగా చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పట్లో కరోనా పేరు చెబుతేనే వెన్నుల్లో వణుకు పుట్టుకు వచ్చేది. కానీ ఇప్పుడు గుండెపోటు పేరు చెబితే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు మన మధ్య ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు చనిపోతున్నారు. ఈ మద్య కాలంలో కొంతమంది పెళ్లి వేడుకల్లో ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్.. రాజనందన్ గావ్ జిల్లా లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ సందర్బంగా బంధుమిత్రులతో అక్కడి వాతావరణం ఎంతో కోలాహలంగా ఉంది. పెళ్లి కూతురు మేనమామ దిలీప్ రాజ్‌కుమార్ పెళ్లి తర్వాత స్టేజ్ పై ఎంతో సంతోషంతో డ్యాన్స్ చేశాడు. అంతలోనే దిలీప్ కి ఛాతి నొప్పి రావడంతో ఇబ్బందిపడ్డాడు.. పెళ్లివేదికపైనే కూర్చుండిపోయాడు. కొద్దిసేపటికి స్టేజ్ పైనే సృహకోల్పోయి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు అందరితో సంతోషంగా ఉన్న దిలీప్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో పెళ్లింట విషాదం నెలకొంది. మృతుడు దిలీప్ కుమార్ బాలోద్ జిల్లాలో నివసిస్తున్నాడు.. భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. డోంగర్‌గఢ్‌లో బుధవారం తన మేనకోడలి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి తర్వాత బారాత్ లో అందరితో కలిసి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేసి అంతలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. పెళ్లి వేదికపై దిలీప్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నవారైనా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. దిలీప్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.