కంగ్టి లో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన సంపూర్ణ బంద్
ముత్యాల పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
సనాతన ధర్మం ప్రపంచ దేశాలకు సద్బుద్ధి జ్ఞానాన్ని బోధిస్తు మానవ జీవన విధానాన్ని బోధించేది
దేవీ దేవతలను కించపరిచే వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల డిమాండ్
జనం న్యూస్,అక్టోబర్ 24,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో స్థానిక పట్టణంలో గురువారం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది.సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని పాశ్చాత్తా సాంస్కృతి సాంప్రదాయాలకు లోబడిన దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా హిందూ ధర్మ సంస్కర్తలు సామరస్యంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించడంతో చాలామందికి తలకు బలమైన గాయాలు కావడం అనేకమందికి దెబ్బలు తగిలి గాయాలవ్వడంతో కంగ్టి మండల కేంద్రంలోని హిందూ బంధువులతో గ్రామంలో ర్యాలీ నిరసన సంపూర్ణ బంద్ నిర్వహించారు.సుభాష్ చంద్రబోస్,ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మకర్తలు మాట్లాడుతూ సర్వేజనా సుఖినోభవంతు అనే ధర్మం సనాతన ధర్మమని,పర మతాన్ని గౌరవిస్తూ,స్వధర్మాన్ని ఆచరించడమే సనాతన ధర్మం లక్ష్యమని అన్నారు.పరస్పరంగా అపకారిని,ఉపకారం చేకూర్చే ధర్మం సనాతన ధర్మమని అన్నారు. ఇంతటి విశిష్టత కూడిన సనాతన ధర్మంపై,దేవి దేవతలపై,నిత్య ఆకృత్యాలు భారతావనిలో రోజురోజుకి దురాక్రమణలు పేచ్చు మీరుతున్నాయని అన్నారు.ఇటువంటి దురాక్రమణలను అరికట్టడానికై పరిపాలిస్తున్న ప్రభుత్వాలు,పోలీస్ శాఖ,కట్టుదిట్టమైన చట్టాలను ప్రయోగించి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు.ధర్మో రక్షితి రక్షితః మనం ధర్మాన్ని రక్షిస్తేనే మనల్ని ధర్మం రక్షిస్తుందని అన్నారు. అనేక తామే ఏకత , భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చాటి చెప్పే ఏకైక దేశం,ఏకైక ధర్మం సనాతన ధర్మం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.