కూటమి ప్రభుత్వ పాలనలోనైన ఉత్తరాంధ్రా జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయా.
జనం న్యూస్ 09 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
మంగళవారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రైతు సంఘం ప్రాంతీయ సదస్సు కరపత్రాలను విడుదల చేసి అనంతరం మీడియాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ లు మీడియాలో మాట్లాడుతూ పాలకులు మారుతున్న ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలో ప్రాంతీయ సదస్సు, రాయలసీమలో ఒకచోట మరియు కోస్తాంధ్ర లో మరోచోట జరపాలని రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు అక్టోబర్ 22 వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో భవిషత్తు కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో 10 50 సెంటీమీటర్లు వర్షపాతం పడుతున్నప్పటికీ, కావలసినన్ని నదులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయటంలో పాలకులు నిర్లక్ష్యం వల్ల పేదరికం అనంత పేదరికలను ఉందని తెలిపారు. కరువు పోవాలంటే తాగునీటి ప్రాజెక్టులు కావాలని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని 1200 గ్రామాలకు చెందిన 30 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని అటువంటి ప్రాజెక్టును పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రాష్ట్ర నలుమూలలే కాక దేశవ్యాప్తంగా వలస కూలీలకు అడ్డాగా ఉత్తరాంధ్ర రైతు కూలీలు ఉన్నారని ఇది చాలా బాధాకరమని దీనిపై నిర్మాణాత్మక ఉద్యమం తప్పదని తద్వారానే పాలకుల మెడలు వంచి ప్రాజెక్టులకు కావలసిన నిధులను రాబట్టుకోవాల్సి ఉందని అందుకై అనకాపల్లిలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కృష్ణ గోదావరి నదులు అనుసంధానం పేరుతో ఉన్నపలంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన పాలకులకు వెనుకు మెట్టబడిన ఉత్తరాంధ్ర జిల్లాల రైతన్న కేవలం వలస కూలీల క్షేత్రంగా ఉంచాలని పాలకుల నైజంగా ఉందని దేనిని ఇంకా ఎన్నాళ్లు సహిస్తామని మన వాటా మనం రప్పించుకోవడం బడ్జెట్లో కొత్తగా ప్రాజెక్టుల కావలసిన నిధులను విడుదలకే రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి అనకాపల్లి లో జరిగే ప్రాంతీయ సదస్సు ఎంతో దోహదపడుతుందన్నారు. మన ఉత్తరాంధ్ర జిల్లాలో సాగు నీటి వనరులకు ఎటువంటి పదవి లేదని పాలకులు ద్వంద్వ వైఖరి వల్ల అనేక చోట్ల నీటి వనరులు చెరువులు ఆక్రమణలకు గురై సాగునీరు కరువవుతుందని రాబోయే కాలంలో పరిస్థితులు ప్రకృతి విలేఖండవానికి దారిచేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి అధ్యయనం చేసే తదుపరి విషయాలను గ్రామస్థాయిలో రైతంగం దృష్టిలో తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, రైతు సంఘం నాయకుడు, పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు,
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్