కోరుట్ల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ జలమయం అక్రమ నిర్మాణాలవల్లే ఈ దుస్థితి
జనం న్యూస్ కోరుట్ల సెప్టెంబర్ 3
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
రాష్ట్రంలో రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కోరుట్ల తహశీల్దార్ కార్యాలయం చూట్టూ జలమయంగా మారిందని చెరువులు కుంటలు కబ్జా చేస్తు అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. సోమవారం కోరుట్లలో జలమయం అయినా ప్రాంతాలను కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ పక్షాన వివిధ సంఘాల నాయకులతో కలిసి పర్యవేక్షించారు అనంతరం తహశీల్దార్ ఇట్యాల కిషన్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలో ఆదర్శనగర్, ముత్యాల వాడ,అయిలాపూర్ రోడ్,తాళ్లచెరువు లోతట్టు ప్రాంతాలు ఇంక కొన్ని వార్డులు జలమయం అయ్యాయని పేర్కొన్నారు. వాగు పరివాహక ప్రాంతం చెరువులు కుంటలు బఫార్ జోన్ లలో అక్రమ నిర్మాణాలు చేయడం కోరుట్లలో ఆనవాయితీగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో తీసుక వచ్చిన హైడ్రా తరహా చట్టాన్ని కోరుట్లలో కోడ్రా పేరిట చట్టాన్ని తెచ్చి ఆక్రమ నిర్మాణాలపై కొరడా జులుపించి ప్రభుత్వ స్థలాలను కాపాడలని ప్రభుత్వాన్ని పేట భాస్కర్ కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథం నాయకులు చింత భూమేశ్వర్, ఇట్యాల రాజేందర్, షాహేద్ మహ్మద్ షేక్, ఎలిశేట్టి గంగారెడ్డి, ఆలీ నవాబ్, శనిగారపు రాజేష్, సురేష్, ప్రసాద్, అఫీజ్ తదితరులు పాల్గొన్నారు.