నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు సందర్శించిన ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు.
జనం న్యూస్ 2 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రిపోర్టర్ దినేష్
ఎగువ మానేరు ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన నాయకులు.
ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారని, ప్రకృతి కనికరించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను ఆశీర్వదించింది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి రైతు ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు నిండడంతో ముస్తాబాద్ ,గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 20 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు గుండం నరసయ్య, మెరుగు యాదగిరి గౌడ్, ఎ ఎం సి మాజీ చైర్మన్లు అంజన్ రావు ,సురేందర్రావు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కిషన్ రావు,దీటి నరసింహులు, వేణు, మహేష్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,ఎలసాని దేవయ్య యాదవ్ ,ప్రతాపరెడ్డి, బండి శ్రీకాంత్ ,అంజిరెడ్డి ,బండ లింగంపల్లి మాజీ సర్పంచ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.