గిరిజన విద్యార్థుల మృతి పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి.* *ఏఐఎస్ఎఫ్ .బి.రవి కుమార్ డిమాండ్.*

గిరిజన విద్యార్థుల మృతి పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి.*  *ఏఐఎస్ఎఫ్ .బి.రవి కుమార్ డిమాండ్.*

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా (రిపోర్టర్ ప్రభాకర్), తేదీ అక్టోబర్ 3,:

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యార్థినిలు రెండు రోజులు వ్యవధిలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు.కొమరాడ మండల కేంద్రంలో ఉన్న *కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని శారద. సోమవారం మృతి చెందగా,గుమ్మలక్ష్యం పురం మండలం కే శివడ గిరిజన సంక్షేమబాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిమ్మల అవంతి బుధవారం మృతి చెందింది.*

గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి ఏంటో పూర్తిస్థాయిలో అర్థమవుతుందన్నారు.*గిరిజన శాఖ మంత్రి మొదటి సంతకం ఏఎన్ఎంలు పోస్టులు పై పెట్టారు.కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో భర్తీ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు* 

అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపం వలన కూడా ఇలా జరుగుతున్నాయి అన్నారు.తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.పూర్తిస్థాయిలో ఏఎన్ఎంలు పోస్ట్లు భర్తీ చేయాలని కోరారు.లేనియెడల భవిష్యత్తులో *గిరిజన శాఖ మంత్రి గారి కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి ముట్టడికి* పిలుపునిస్తామని తెలిపారు.