శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం*.

శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం*.

జనం న్యూస్ అక్టోబర్ 3 శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. మహిళలు రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చుకొని వచ్చి దేవాలయంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఆటపాటలతో జరుపుకున్నారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఏర్పాట్లు చేసినారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ మాట్లాడుతూ అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వందల సంవత్సరాల నుంచి మహిళలు బతుకమ్మ ఉత్సవాలను ఎనిమిది రోజులపాటు దేవాలయంలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో జరుపుకుంటారని 9వ రోజు సద్దుల బతుకమ్మను తాళ్లకుంట చెరువు వద్ద జరుపుకుంటారని అన్నారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ బందోబస్తు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....