ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు.

ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు.

జనం న్యూస్: తేదీ (23 డిసెంబర్ 2024) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. 
రిపోర్టర్ పేరు: బాలాజీ  

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం మార్కెట్ ఏరియా లో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో సోమవారం నాడు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ జి భాస్కర్ రావు, ప్రిన్సిపాల్ జి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ,ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి తన మేధస్సుతో భారత దేశ కీర్తిని ప్రపంచ గణిత శిఖరాల పై ఎగురవేసిన గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి గణిత శాస్త్రం మూల స్తంభం అని, ఆయన ఆలోచనలు ఫార్ములాలు అద్భుతమని, సంఖ్యలు కూడా మాట్లాడుతాయి అని నిరూపించిన గొప్ప మేధావి అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గణిత అధ్యాపకులు  డి సత్య ప్రసాద్, జి స్వాతి ని  ఘనంగా సన్మానించినారు.విద్యార్థులు ప్రదర్శించిన  గణిత ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని విశేషముగా ఆకర్షించినవి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి స్వరూప జి రమాదేవి ఝాన్సీ కే మహేశ్వరి ఎస్ ప్రశాంతి  శ్వేత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.జి భాస్కర్ రావు స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
9866806532